సినిమా

Peddi: రామ్ చరణ్‌కు లండన్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్..

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల హృదయాల్లో మరోసారి సందడి చేశారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులు రామ్ చరణ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

యువ దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా షూటింగ్‌లో గ్యాప్ సమయంలో రామ్ చరణ్ లండన్‌లో RRR లైవ్ ఆర్కెస్ట్రా, వాక్స్ స్టాట్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ అభిమానులు అందించిన బ్యాట్‌తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు.

‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ హిట్ సందర్భంగా అభిమానులు ఆప్యాయంగా ఈ బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందించారు. దీనిపై రామ్ చరణ్ తన ఆటోగ్రాఫ్‌ చేసి అభిమానులను మరింత ఆనందపరిచారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button