News

Aghori Arrest: యూపీలో అఘోరీ అరెస్ట్

Aghori Arrest: యూపీలో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని నార్సింగీ పీఎస్‌కు తరలించారు. చీటింగ్ కేసులో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం జైల్లోనే అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఉన్నాడు. పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన కేసులో మోకిల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మరోవైపు వర్షిణిని కూడా హైదరాబాద్‌కి పో లీసులు తీసుకొస్తున్నట్లు టాక్ వినబడుతోంది.

అయితే ఈ విషయాన్ని మోకిల పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించారు శంకర్‌పల్లికి చెందిన వినితా భాటీ. ఇక ఒప్పందం ప్రకారం 9లక్షల 80వేల రూపాయలు ఇచ్చారు వినితా భాటీ. అయితే అఘోరీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వినితా భాటీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button