ఆంధ్ర ప్రదేశ్
Jagan: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు

Jagan:మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు ఏడుగురు వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే జగన్ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే నిన్న గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు.
ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీసు యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సీహెచ్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.