తెలంగాణ
తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం

Telangana: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డిని నూతన సీఎస్‌గా నియమితులైన రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది.