తెలంగాణ
Konda Surekha- Seethakka: సమ్మక్క, సారక్కల్లా కలిసే ఉంటాం
Konda Surekha- Seethakka: తాము ఎల్లప్పుడూ సమ్మక్క, సారక్కల్లా కలిసే ఉంటామన్నారు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.. ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం సృష్టించారని వారు తెలిపారు.
ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. పర్యటనలో భాగంగా మహిళా మంత్రులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారని వెల్లడించారు.