తెలంగాణ
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా ? బండి సంజయ్ ఉన్నాడా ?

Komatireddy Venkat Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కి పద్మశ్రీ అవార్డులపై చేసిన వ్యాఖ్యలకు… మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన కాలికి గజ్జె కట్టి ఊరూరు తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గద్దర్, ప్రజలకు చాటి చెప్పి వారిలో చైత్యన్యాన్ని నింపారని గుర్తు చేశారు.
చనిపోయే వరకు ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్న నాడు.. ఇదే బండి సంజయ్ ఎక్కడున్నాడని ధ్వజమెత్తారు. భాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు.