ఆంధ్ర ప్రదేశ్
ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్న ఆయన నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి సీఎంగా చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు.
అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాజకీయ పరంగా విభేదించినప్పటికీ అభివృద్ధి విషయంలో ఫాలో అవుతామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని, అదే స్నేహంగా కొనసాగాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు.



