ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: మంగినపూడి బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

Kollu Ravindra: కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో సముద్ర స్నానం ఆచరించారు మంత్రి కొల్లు రవీంద్ర. వేదపడింతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత హారతి ఇచ్చిన అనంతరం భక్తులతో కలిసి పవిత్ర సముద్ర స్నానం ఆచరించారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.
లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంగినపూడి బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.



