Kareena Kapoor: యువ నటుడితో కరీనా కపూర్ రొమాన్స్!

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ కొత్త సినిమాతో సంచలనం సృష్టించనున్నారు. హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీలో ఆమె దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. యువ నటుడితో రొమాన్స్, ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రం ఆకట్టుకోనుంది.
కరీనా కపూర్ ఖాన్ తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేస్తున్నారు. గ్లామర్, ఫ్యామిలీ డ్రామా పాత్రలతో అలరించిన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా దెయ్యం పాత్రలో కనిపించనుండగా, ఓ యువ నటుడితో స్క్రీన్ షేర్ చేయనున్నారు. ఈ కథ కేవలం హర్రర్‌తోనే కాకుండా, ప్రేమ, ఎమోషన్స్, మానవ సంబంధాలను కలిపి కొత్త రీతిలో తెరకెక్కనుంది.
ప్రముఖ రచయిత హుస్సేన్ దలాల్ కథ అందిస్తుండగా, ఈ చిత్రం బాలీవుడ్‌లో రిఫ్రెషింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. కరీనా సరసన నటించే యువ నటుడు ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. కంటెంట్ ఆధారిత చిత్రాలతో మరింత ప్రేక్షకాదరణ పొందేందుకు కరీనా సిద్ధమవుతున్నారు.