ఆంధ్ర ప్రదేశ్
Kakani: మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్

Kakani: మాజీ మంత్రి కాకాణికి రిమాండ్ విధించింది కోర్టు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. దీంతో కాకాణిని వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
మొదట స్థానిక పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అంతకుముందు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో కాకాణిని విచారించారు పోలీసులు. ఆదివారం కేరళలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం నెల్లూరుకు తరలించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి. రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.