ఆంధ్ర ప్రదేశ్
Kakani: కూటమి సర్కార్ వ్యవసాయాన్ని వదిలేసింది

Kakani: సీఎం చంద్రబాబు సెట్టింగులు వేయించుకుని మాటలు చెప్పటం తప్ప రైతులకు చేసిందేమీ లేదని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.బూస్టర్ డోస్ యూరియా అందకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదమున్న చంద్రబాబు సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని కాకాణి విమర్శించారు. బ్లాక్ మార్కెట్ లో బస్తాకు 200 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని వైసీసీ నేత ఆరోపించారు. యూరియా కోసం రైతులు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు.



