Kajal: బాలీవుడ్ రామాయణంలో కాజల్ సరికొత్త రోల్?

Kajal: దంగల్ దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ రామాయణం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండగా, తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో చేరినట్లు సమాచారం. ఆమె మండోదరి పాత్రలో కనిపించనున్నారని టాక్.
బాలీవుడ్ రామాయణం సినిమా సెట్స్‌పై సందడి నెలకొంది. ఈ భారీ చిత్రంలో రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, సూర్పనకగా రకుల్ ప్రీతి సింగ్ ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సమాచారం. రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం కాజల్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. అయితే, కాజల్ పాత్రపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ రామాయణం సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాజల్ ఎంట్రీతో మరింత హైప్ పెరిగింది.