Tirumala: తిరుమలలో యోగ సాధన చేసిన చిన్నారి

Tirumala: లక్ష్యంతో ముందుకు వెళ్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సంకల్ప దీక్ష ఉంటే చాలు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చునేది ఇక్కడ ఓ చిన్నారిలో కన్పించింది. కాకినాడకు చెందిన 14 ఏళ్ల చిన్నారి రికార్ది చైత్ర జవాస్కీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంది. చక్కగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున మొక్కులు చెల్లించుకుంది. తల్లితండ్రుల ఇష్టమే తన ఇష్టంగా భావించిన చైత్ర యోగ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
యోగాను పాఠశాలలో ఫిజికల్ ట్రైనర్ గా శిక్షణ ఇస్తున్న టీచర్ మృదుల చిన్నారి చైత్రకు మొదట యోగ నేర్పింది. అనంతరం యోగ అకాడమీలో శిక్షణ ఇస్తున్న దుర్గా ప్రసాద్ ట్రైనింగ్ తో యోగాను సులువుగా నేర్చుకుంది. కష్టమైన ఆసనాలు సైతం చాలా సులువుగా, సెకండ్ల వ్యవధిలో చేస్తుంది చైత్ర. నేషనల్ మెడల్ కోసం చిన్నారి సాధన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.