తెలంగాణ
గ్రూప్-2 పరీక్ష రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015లో విడుదలైన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ సంవత్సరం జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్‌పై నమోదైన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు టీజీపీఎస్సీ (టీఎస్ పీఎస్సీ) జారీ చేసిన 2019 సెలక్షన్ లిస్ట్‌ను పూర్తిగా రద్దు చేసింది. పరీక్ష ప్రక్రియలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని, అవి ఎంపికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
టీజీపీఎస్సీ రూపొందించిన ఎంపిక జాబితా సక్రమంగా లేదని పేర్కొంటూ, అందులో ఉపయోగించిన ఓఎమ్‌ఆర్ షీట్లను మళ్లీ రీవాల్యూయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అన్ని షీట్లను పునఃసమీక్షించిన తర్వాత కొత్త సెలక్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసి ప్రకటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



