ఆంధ్ర ప్రదేశ్
Jagan: ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు

Jagan: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇవాళ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.
ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయని దుయ్యబట్టారు.



