Jagadeeshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో

Jagadeeshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి . లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో కెసిఆర్ జన్మదినం పురస్కరించుకుని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
తోటి నాయకులను గౌరవించాలేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడని మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్క బోర్ల పడ్డాడని అన్నారు. రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి పై నేతలు తిరిగి పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వచ్చాయని విమర్శలు చేశారు.