తెలంగాణ
Mallikarjun Kharge: PAC సమావేశంలో ఖర్గే హాట్ కామెంట్స్

Mallikarjun Kharge: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన PAC సమావేశం కొనసాగుతోంది. భేటీలో ఖర్గే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని నేతల్ని హెచ్చరించారు. అదేవిధంగా నేతలు ఆచితూచి మాట్లాడాలంటూ పలు సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా మంత్రి పదవిలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలన్నారు ఖర్గే.
కష్టపడిన వారికే పదవులు వస్తాయని చెప్పిన మల్లికార్జున ఖర్గే మరో 15ఏళ్లు అధికారంలో ఉండేలా పనులు చేయాలని సూచనలు చేశారు. పని చేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రేవంత్, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.