టాలీవుడ్
IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు
IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. SVC, మైత్రి, మ్యాంగో సంస్థల్లో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే కీలక పత్రాలను పరిశీలించిన ఐటీ బృందం.. మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. 4 రోజులుగా నిర్మాతల నివాసాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.