తెలంగాణ
చెన్నూరు ఎస్బీఐ అవకతవకలపై 10 మందిపై కేసులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో అవకతవకలపై 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యాషియర్ రవిందర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బంగారం, నగదు కలిపి నాలుగు కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చెన్నూరులో తీవ్ర సంచలనం కలిగించిన బ్యాంకు అవకతవకలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.



