Netanyahu: ట్రంప్ ఇరాన్‌కు నెం.1 శత్రువు.. అందుకే చంపాలని చూస్తోంది

Netanyahu: ఒక దేశాన్ని అణిచేయాలంటే ఓ అణుబాంబు అవసరం లేదు ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకుంటే చాలు. ఇదే పంథాలో సాగుతోంది మిడిల్ ఈస్ట్ సంక్షోభం. యుద్ధం చేసేటప్పుడు అగ్రనాయకుడ్ని లేపేస్తే ఇక సైన్యం యుద్ధం చేయలేదన్న నీతిని ప్రదర్శించాలని చూస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపడానికి అంతా సెట్ చేసుకుంటే ట్రంప్ నిరాకరించాడని, నెతన్యాహు పెదవివిరిచాడు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడానికి నెతన్యాహు చేసిన ప్రణాళికను ట్రంప్ వీటో చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. యుద్ధం ముగియాలంటే అయతుల్లాను లేపేయడమే మార్గమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం నాల్గో రోజుకు చేరుకోగా, ఒకరిపై ఒకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పరిస్థితి అదుపు తప్పిందని విశ్లేషకులు భయపడుతున్నారు. సుప్రీం నాయకుడిని చంపాలనే ఇజ్రాయెల్ ప్రణాళిక వల్ల పెద్దగా నష్టం జరగదంటాడు నెతన్యాహు.
ఇరాన్, శాశ్వత యుద్ధం ఇరాన్ కోరుకుంటుందని, అణు యుద్ధం అంచుకు తీసుకువెళ్లాలని చూస్తోందని ఆయన విమర్శించాడు. తాము ఇరాన్‌పై చేస్తోందని దురాక్రమణకు ముగింపు అంటూ నమ్మబలుకుతున్నాడు. దుష్ట శక్తులను ఎదిరించడం మాత్రమే తాము చేస్తోందంటాడు.
మరోవైపు నెతన్యాహు అన్నంత పని చేస్తాడని, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ, మొత్తం కుటుంబాన్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఇరాన్‌లోని ఒక తెలియని ప్రాంతంలో ఉన్న బంకర్లో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సుప్రీం నాయకుడిని కాపాడుతున్నాయి.
ఓవైపు ఇరాన్ అధినేతను లేపేసేందుకు ప్లాన్ సిద్ధం చేసిన నెతన్యాహు, మరో విచిత్రమైన వార్తను తెరపైకి తెచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను లేపేయాలని ఇరాన్ చూస్తోందంటూ బాంబు పేల్చాడు. ఇరాన్‌కు ట్రంప్ ఎనిమీ నెంబర్ కావడం వల్లే టార్గెట్ అయ్యాడన్నాడు. అమెరికా అధ్యక్షుడిని ఇరాన్ రెండుసార్లు హత్య చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు.
తమను తాము రక్షించుకుంటూనే ప్రపంచాన్ని కూడా తాము కాపాడుకుంటున్నామంటాడు నెతన్యాహు. ప్రాణం మీదకు వచ్చే సరికి ప్రాణాలు, కాపాడాలంటూ అమెరికాను, ఇరాన్ వేడుకుంటుందన్నాడు. ఇరాన్ పాలకులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను రెండుసార్లు హత్య చేయడానికి ప్రయత్నించారని దుయ్యబట్టాడు.
బీరుట్లో 241 మంది అమెరికా మెరైన్లను, ఇరాన్ మూకలు చంపాయని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లో వేలాది మంది అమెరికన్ సైనికులను ఇరాన్ చంపడం లేదంటే గాయపరచడం చేసిందన్నాడు. అమెరికాలోని రెస్టారెంట్‌పై బాంబు దాడి చేయడానికి ప్రయత్నించి, అమెరికన్లకు చావు హెచ్చరికలు పంపారన్నాడు.
అమెరికా జెండాను తగలబెట్టి విధ్వంసం సృష్టించారన్నాడు. ఇలాంటి వ్యక్తులు అణ్వాయుధాలతో మీ నగరాలను ధ్వంసం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని నెతన్యాహు ప్రశ్నించాడు. ఐతే ట్రంప్‌పై హత్యాయత్నం, నేరుగా ఇరాన్ నుండి జరిగాయని మీకు ఏదైనా సమాచారం ఉందా అన్న ప్రశ్నకు తనకు సమాచారం ఉందని బదులిచ్చాడు.
ఇరాన్‌కు ట్రంప్ నెంబర్ 1 శత్రువుని, తనను కూడా చంపాలని ప్రయత్నించిందన్నాడు. తనను అందరూ, ట్రంప్ జూనియర్ భాగస్వామి అంటున్నారంటూ నెతన్యాహు చెప్పుకుంటున్నాడు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచానికి చేటన్న విశ్వాసంతోనే తాము ఆ దేశంపై దాడి చేశామన్నాడు.