సినిమా

Peddi Movie:'పెద్ది' విడుదల తేదీపై ఇంట్రెస్టింగ్ టాక్

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ గురించి అందరికీ తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచి మొన్నటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు ఈ సినిమా సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి ఇప్పుడు కొత్త అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి.

మొదట్లో ఈ ఏడాది రిలీజ్‌కి మేకర్స్ ప్లాన్ చేసినా, ఓటీటీ డీల్స్ కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ కోసం రెండు డేట్స్ చర్చలో ఉన్నాయి. మార్చి 20 లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. రేపు రిలీజ్ కానున్న గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు వస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. మరి, ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button