తెలంగాణ
Jagga Reddy: హరీష్‌రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy: హరీష్‌రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. ట్రుబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్‌రావు మెదక్ ఎంపీ ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్‌లో గెలిస్తే మనం గెలవాలి లేకపోతే బీఆర్ఎస్ గెలవాలి కానీ బీజేపీ గెలవకూడదని నేను మా కార్యకర్తలకు చెప్పానని అన్నారు.
కేసీఆర్, హరీష్‌రావు ఉన్న తర్వాత బీజేపీ ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్‌కు సీట్లు రావద్దని బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి వేయించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేసిందన్నారు.