తెలంగాణ
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలించనున్నారు. ఏప్రిల్ 9వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించనుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవికాలం ముగుస్తుండటంతో.. నోటిఫికేషన్ వెలువడింది.