అంతర్జాతీయం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

అమెరికాలోని డల్లాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు దంపతులు శ్రీవెంకట్, తేజస్విని పిల్లలు సిద్ధార్థ్, మృదాగా గుర్తించారు.
విహారయాత్రలో భాగంగా తమ కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో రాంగ్‌రూట్ లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందినవారు. స్థానిక జూపిటర్ కాలనీకి చెందిన శ్రీవెంకట్, కొంపల్లికి చెందిన చొల్లేటి తేజస్వినికి 2013లో వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.