తెలంగాణ
Hyderabad: తాగి బండి నడిపిన వ్యక్తికి బుద్దొచ్చేలా చేసిన SHO లక్ష్మీ…

Hyderabad: సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, కౌన్సిలింగ్, చలాన్లు వేస్తారు. ఇది సహాజం.. కానీ ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్దొచ్చేలా చేశారు. తాగొచ్చిన తండ్రిని ఉద్దేశించి కొడుకుతో… నాన్న.. నాకు నువ్వు కావాలి… నువ్వు మరోసారి తాగి బండి నడపనని ప్రామిస్ చేయ్ అని తండ్రిని కదిలించేలా ఆమె ప్రమాణం చేయించారు. ఈ వీడియో చూసిన పలువురు మేడమ్ మీరు గ్రేట్ అంటూ కీర్తిస్తున్నారు.