ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. రంగనాయకుల మండపంలో స్వామివారి శేష వస్త్రంతో మంత్రిని సత్కరించి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు.



