Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనానాకి పొటెత్తారు. వారాంతం కావడంతో అనుహ్యంగా పెరిగిన రద్దీతో ఏడుకొండలవాడి సన్నిధి భక్తజనులతో కిక్కిరిసిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు సర్వ దర్శనానికి 24 గంటలు, టోకెన్లు కలిగిన భక్తులకు 10 గంటలు సమయం పడుతొంది. ఎటుచూసినా భక్తులతో బారులు తీరిన పొడవాటి క్యూలైన్లు కనబడుతున్నాయి. రింగురోడ్డులో ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది.
రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండుమూడు గంటల క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం కిటకిటలాడుతున్నాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.