ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం జిల్లా బుచ్చంపేటలో ఉద్రిక్తత

విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం, గోడ నిర్మాణ విషయంలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడులు చేసుకున్నారు. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం వారిని రాజాం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button