అంతర్జాతీయం

HMPV Virus: చైనాలో పెరుగుతున్న HMPV వైరస్ కేసులు

HMPV Virus: చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో HMPV తరహా కేసులు ఎక్కడా లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. HMPV వైరస్‌ చలికాలంలో.. జలుబు, ఫ్లూ లక్షణాలు కలగజేస్తుందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపింది. అయితే ప్రస్తుతానికి వైరస్‌పై భయాందోళనలు అక్కర్లేదని వెల్లడించింది.
ఇక కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. షేక్ హ్యాడ్ ఇవ్వడం, కళ్లు, ముక్కును తరచూ తాకడం లాంటి చేయకుండా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button