తెలంగాణ
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత

Banjara Hills: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి. గుడి వద్దకు స్థానికులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల భారీ బందోబస్తుతో అడ్డుకునే యత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. గుడి వద్దకు బోనాలతో ర్యాలీగా వెళ్లారు. గుడిని పున: ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.