తెలంగాణ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఎన్నికలకు వెళ్లమని సుప్రీం చెప్పింది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్డర్‌లో ఎక్కడా చెప్పలేదని ఈసీ తరపు న్యాయవాది చెప్పారు. ఈనెల 16న ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.



