నేడు రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ

నేడు రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 46ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్‌లు ఖరారు చేశారని పిటిషన్ దాఖలు చేశారు.
డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు ఇచ్చారు కానీ, రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని తెలిపారు. జీవో నెంబర్ 46లో బీసీలోని ఏ బీ సీ డీ లకు రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు.
ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్‌లు ఖరారు చేశారని పిటిషన్‌లో తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు ఇచ్చారు కానీ, రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని తెలిపారు. జీవో నెంబర్ 46లో బీసీలోని ఏ బీ సీ డీ లకు రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదని పిటిషన్‌లో మచ్చదేవ్ తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను రద్దు చేయాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.



