తెలంగాణ
నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ

నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ పలువురు గ్రామస్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వెల్దండ తిమ్మనోనిపల్లి వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై, వరంగల్, సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్న వేళ హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు కావడం హాట్ టాపిక్‌గా మారింది.



