ఆంధ్ర ప్రదేశ్
Gorantla Madhav: ఇందిర హయాంనాటి ఎమర్జెన్సీని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు

Gorantla Madhav: చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. చంద్రబాబు ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసులుపెడుతూ తమ అధినేత జగన్ ను ఆపాలని చూస్తే సూర్యుడిని చేతితో ఆపాలని చూసినట్టేనని అన్నారు.
తప్పుడు కేసులు, బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని మాధవ్ అన్నారు. పోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు.