తెలంగాణ
Hyderabad: హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నానికి ఆకాశం చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడా, అమీర్పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది.