తెలంగాణ
నిర్మల్ లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన సోయా ధాన్యం

Nirmal: మొంథా తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలో సోయా ధాన్యం తడిసి ముద్దైంది. కుబీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సోయా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డులో పంటపై కవర్లను కప్పి ఉంచారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.



