ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు

Tirumala: పుణ్యక్షేత్రమైన తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు తిరుమలాంతట దట్టమైన పొగమంచు కమ్ముకుంది, ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనబడనంతగా మంచు వ్యాపించింది.
వాతవరణంలో చోటుచేసుకున్న ఈ మార్పులతో తిరుమల కొండపై చలితీవ్రత బాగా పెరిగింది. చంటి బిడ్డలు, మహిళలు, వృద్ధులు చలికి తట్టుకొలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బంది ఆలర్ట్ గా ఉన్నారు, భక్తులు కూడా ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తుంది.



