అల్పపీడనం ప్రభావం.. తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో వర్షం భారీగా కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా భక్తులు ఒకంత ఇబ్బందులకు గురవుతున్నారు, శ్రీవారి దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్న భక్తులు తలదాచుకునేందుకు షెడ్లు వైపుకు పరుగులు తీస్తున్నారు. ఆగకుండా వర్షం కారణంగా నిత్యం భక్తుల గోవింద నామస్మరణలతో సందడిగా ఉండే ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సంభందిత సిబ్బంది అప్రమత్తమయ్యారు, భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ శాఖ సూచిస్తుంది. ఇక వర్షం తగుముఖం పట్టేవరలు తిరుమలలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చలి తీవ్రత కూడా విపరీతంగా పెరగడంతో చంటి బిడ్డలు వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచిస్తుంది.



