తెలంగాణ
Rain: హైదరాబాద్లో రాత్రి దంచికొట్టిన వాన.. బండ్లగూడలో 8.8 సెం.మీ వర్షపాతం నమోదు

Rain: హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు నగరవ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్తోపాటు మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ అండ్ బేగంపేట, అమీర్పేట, ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి, రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.