తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో లక్నాపూర్ ప్రాజెక్టుకు జలకళ

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. భారీ వర్షాలతో లక్నాపూర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు అలుగు పారుతుంది.
2 వందల ఎకరాల విస్తీర్ణంలో 0.3 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా 2647 ఎకరాలకు సాగు అందుతోంది. లక్నాపూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాతాల ప్రజలు ప్రాజెక్టును చూసేందుకు బారులు తీరారు.