తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక కొట్టివేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించనుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే స్టే విధించింది కోర్టు. ఇవాళ 4 పిటిషన్లపై విచారణ జరపనుంది కోర్టు.



