తెలంగాణ
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ

కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు అందలేదన్నారు. ఎంక్వైరీ కమిషన్లో వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ 8B నోటీసులు ఇవ్వాలన్నారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని సుందరం వాదించారు.



