తెలంగాణ

Harish Rao: హామీలు అమలుచేయలేని సీఎం..ఢిల్లీ వెళ్లి అబద్దాలు చెబుతున్నాడు

Harish Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్‌ సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను ఆన్‌ చేసి గోదావరి జలాలను వినియోగించుకోవాలని రేవంత్‌ను హరీష్‌ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేసినట్లు హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా నరసాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన హరీష్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని, కొన్ని మొదలు పెట్టలేదని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button