తెలంగాణ
HICC: రియల్ ఎస్టేట్ సమ్మిట్ - 2025, లైవ్ లో చూడండి ..

హైదరాబాద్ అభివృద్దికి రాజ్‌న్యూస్ నడుంబిగించింది. HICC నోవాటల్‌లో రియల్ ఎస్టేట్ సమ్మిట్-2025 పేరిట బిగ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. నేరెడ్‌కో తెలంగాణ, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్‌తో కలిసి రాజ్‌న్యూస్ ఈ కార్యక్రమాన్ని చేస్తోంది. దీనికి భారీగా అతిరథ మహారథులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా గణేష్ వందన కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యం అందిరనీ ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాజ్‌న్యూస్.. సామాజిక బాధ్యత కలిగిన వార్తా సంస్థ అని.. ఆ సంస్థ డైరెక్టర్ సాహితీరావు తెలిపారు. ప్రజా క్షేమం కోసమే రాజ్‌న్యూస్ పోరాడుతుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ సమ్మిట్-2025లో ప్రారంభ ఉపన్యాసం చేశారు ఆమె.