Maha Kumbh Mela: మాఘ పౌర్ణమి.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా భారీగా రద్దీ పెరగడంతో.. అధికారులు నో వెహికల్ జోన్‌గా కుంభమేళా ప్రాంగణాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా.. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనుంది. ఇప్పటివరకు 45కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారు.
కుంభమేళాలో ట్రాఫిక్ జాం రోజురోజుకు పెరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. 4గంటల ప్రయాణానికి 12గంటల సమయం పడుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. వేలాది మంది భక్తులు హైవేపైనే గడపాల్సి వస్తుంది. బీహార్‌లో 35 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ససారంలోని రోహ్తాస్ జాతీయ రహదారిపై ట్రక్కులు, బస్సులు, కార్లు బారులు తీరాయి.
మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కి భారీగా భక్తులు వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం మహా కుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. ఇది 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్‌కి కారమైంది. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లోని అనేక జిల్లాలోని పోలీసులు ప్రయాగ్ రాజ్‌కి వెళ్లే వాహనాలను నిలిపేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.