తెలంగాణ
మేడారంలో ఘనంగా గుడిమెలిగే పండుగ

ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క, సారలమ్మ దేవాలయంలో గుడి మెలిగే క్రతువును ఘనంగా నిర్వహించారు. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా ఈ గుడి మెలిగే పండుగను నిర్వహిస్తామని పూజారులు తెలిపారు. గుడిలోని పూజా సామగ్రిని శుద్ధి చేసి, ఆలయం ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.



