తెలంగాణ
Kaleshwaram: కాళేశ్వరం వద్ద ‘ఉగ్ర’ గోదావరి

Kaleshwaram: తెలంగాణ, మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పుష్కర ఘాట్‌ల వద్ద 7.71 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా వరద తాకిడి నెలకొంది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటివిడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో- ఔట్ ఫ్లో 3 లక్షల 10 వేల 80 క్యూసెక్కులుగా ఉంది.



