తెలంగాణ

నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. వార్షిక బడ్జెట్ ఆమోదంపై చర్చ

జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. దీని కోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రశ్నించేందుకు సభ్యలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. రాజకీయ వేడి అలుముకున్నది. మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్​నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్, ఎంఐఎంకి చెందినవారే ఉండడంతో.. మేయర్‌కు మద్దతిచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌లో బడ్జెట్‌కి ఆమోదం లభిస్తుందా..? లేదా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీ సహకరిస్తాయా..? లేక రచ్చ చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌తో పాటు.. 2024-25లో ప్రవేశపెట్టి సవరించిన బడ్జెట్‌పై చర్చించడంతో పాటు.. ఆమోదం కోసం ఈ కౌన్సిల్​మీటింగ్​నిర్వహిస్తున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలను తీసుకున్నారు. ఇందులో 21 ప్రశ్నలు వేసి చర్చించేందుకు ఆమోదించారు. అయితే.. ఇది వరకు చేసిన పనులపై కూడా చర్చించాలని.. కార్పొరేటర్లు పట్టు బట్టే అవకాశమున్నట్టు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button