తెలంగాణ
Hyderabad: నెక్లెస్ రోడ్డులో ఫన్ ఫర్ యాక్షన్.. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సీతక్క

Hyderabad: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఫన్ ఫర్ యాక్షన్ కార్యక్రమం జరిగింది. పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. అలాగే సీవీ ఆనంద్, బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారని మహిళలంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని తెలిపారు. పురుషులు, మహిళలకి అందరికీ సమానత్వం ఉండాలన్నారు సీతక్క. ఎప్పుడైనా మహిళల వ్యక్తిత్వం, వికాసం కాపాడాలని సూచించారామె.