Chandrababu: ఫ్రీబస్ పథకం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీబస్ పథకం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేరో టిక్కెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు. ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి. 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండాఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని సీఎం సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి. ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. అదే సమయంలో ఇక ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.
ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానం రూపొందించాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించడం, ఉత్పత్తి పెంచడం, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.